KGF Forms
KGF సభ్యత్వం పొందడం ద్వారా మీకు KGF Membership card ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన కమ్మ వారు నడుపుతున్న ఆర్గనైజేషన్లలో కొన్ని జాబ్స్ కోసం, స్కూల్స్ లలో కొంత ఫీజు రాయితీ కోసం, హాస్పిటల్ బిల్స్ లో కొంత రాయితీ కోసం కేజీఎఫ్ వారితో మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. అలా ఒప్పందం కుదిరిన సంస్థలలో మీరు ఈ KGF card చూపించి ఆ సదుపాయాలని పొందగలరు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన కమ్మ వారి సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా మన వారి యెక్క ఆర్ధిక స్థితి, గతులు మరియు దారిద్య రేఖకి దిగువన వున్న వారి గురించి తెలుసుకోని రాబోవు రోజుల్లో వారికి మనం చేయూతని అందించి వారు కూడా ఉన్నత స్థానానికి ఎదగడానికి కేజీఎఫ్ కృషి చేస్తుంది. మరియు ప్రపంచ వ్యాప్తంగా మన ఇంటి పేరు, గోత్రం, బంధువులు, మన ఊరి వారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇది రోబోవు రోజుల్లో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి మరియు కమ్మ జాతిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మన కమ్మ వారిలో ఉన్న అనాథ పిల్లలు మరియు దారిద్ర్య రేఖకి దిగువున ఉన్న కుటుంబాలలోని పిల్లల కోసం KGF ద్వారా ఆ పిల్లలని విద్యావంతులు గా తీర్చి దిద్దడం కోసం మీ అందరి సహాయం కోరుతున్నాము. అవకాశం వున్నవారు ఒక్కో విద్యార్థి కోసం ఒక్క ఇయర్ కి Rs. 20,000 వేలు చొప్పున సహాయం చేయగలరు. ఒక్కొక్కరు ఎంత మందికైనా చేయవచ్చు. మీరు ఇచ్చే సహాయం ఎవరికి చేరుతుందనే సమాచారం మీకు అందిస్తాము.